రెండు శతాబ్దాల తర్వాత..! | Sakshi
Sakshi News home page

రెండు శతాబ్దాల తర్వాత..!

Published Tue, May 31 2016 1:46 PM

After two centuries, Sweden has more men than women

ప్రపంచంలో స్త్రీల నిష్పత్తి ఎక్కువగా కలిగి 1749 నుంచి పురుషుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించిన స్వీడన్ ఎట్టకేలకు విజయం సాధించింది. దాదాపు రెండు శతాబ్దాల కృషికి ఫలితంగా మహిళా జనాభాను పురుషుల సంఖ్యను సమానం చేసింది. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, శరణార్ధులు వల్లే స్త్రీ-పురుషుల నిష్పత్తిలో హెచ్చుతగ్గులను తొలగించాయని, యూరప్ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైన శకం అని యూరోపియన్ అసోసియేషన్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అధ్యక్షుడు ఫ్రాన్సెస్కో బిల్లారి తెలిపారు.

ప్రస్తుతం ప్రతి వంద మంది యూరోపియన్ స్త్రీలకు యావరేజ్ గా 105 మంది మగబిడ్డలు జన్మిస్తున్నట్లు లెక్కల్లో తేలిందినార్వేలో మహిళల సంఖ్య కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండగా.. డెన్మార్క్, స్విట్జర్లాండ్ లు వందకు చేరువయ్యాయి. బ్రిటన్ లో స్త్రీ-పురుషుల నిష్పత్తి 93 నుంచి 97 కు చేరింది. 2050 సంవత్సరానికి పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగి మహిళలను దాటేస్తారని బ్రిటీష్ స్టాటిస్టిక్స్ అధికారులు తెలిపారు. మహిళలతో పోలిస్తే పురుషుల జీవితకాలం బాగా పెరిగిందనీ, అంతేకాకుండా సిరియా, ఉత్తర ఆఫ్రికా, ఆప్ఘనిస్తాన్ ల నుంచి వచ్చిన శరణార్ధలలో ఉన్న పురుషుల సంఖ్య స్త్రీ-పురుషుల జనాబా నిష్పత్తిపై బాగా ప్రభావం చూపినట్లు వివరించారు.

స్వీడన్ లో అత్యధికంగా 100 మంది మహిళలకు 108 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. పురుషుల్లో అధికంగా 15-19 సంవత్సరాల వయసు కలిగిన వారే ఉండటం గమనార్హం. కాగా, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ వంటి తదితర దేశాల్లో ఇంకా స్త్రీల నిష్పత్తి అధికంగానే ఉంది. మొత్తం 28 దేశాల సమూహమైన యూరప్ లో పురుషుల వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement