భారతీయ శాస్త్రవేత్తకు కెనడా రోజర్స్ ప్రైజ్ | Sakshi
Sakshi News home page

భారతీయ శాస్త్రవేత్తకు కెనడా రోజర్స్ ప్రైజ్

Published Sat, Sep 28 2013 2:14 AM

Alberta researcher takes $250000 Dr. Rogers Prize

టొరాంటో: ప్రత్యామ్నాయ వైద్యవిధానంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా జన్మతఃభారతీయురాలైన సునీతా వోహ్రా అనే 42ఏళ్ల శాస్త్రవేత్తకు కెనడాలో అత్యున్నత పురస్కారం డాక్టర్ రోజర్స్ ప్రైజ్ లభించింది. ఉత్తర అమెరికాలోనే అత్యధిక నగదు బహుమతి ఇది. ఆల్‌బెర్టా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సునీతాకు ఈ ప్రైజ్ కింద దాదాపు 1.50 కోట్లు నగదు దక్కనుంది. ఈ విషయాన్ని వాంకోవర్ సన్ అనే పత్రిక గురువారం ప్రచురించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement