రద్దీ రోడ్డులో అరుదైన బాటసారితో అవాక్కు | Sakshi
Sakshi News home page

రద్దీ రోడ్డులో అరుదైన బాటసారితో అవాక్కు

Published Tue, Oct 11 2016 2:10 PM

రద్దీ రోడ్డులో అరుదైన బాటసారితో అవాక్కు

న్యూయార్క్: అమెరికాను మాథ్యూ హరికేన్ ఎంతటి భయబ్రాంతులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ తుఫాను వెళ్లిపోయిన తర్వాత ఏర్పడిన పరిణామాలు కూడా అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ తుఫాను బీభత్సం కారణంగా భయంకరమైన జల సరిసృపాలు, పాములు ఇప్పుడు అక్కడి వీధుల్లో ఇళ్లల్లో షికార్లు చేస్తూ వారిని వణికిస్తున్నాయి. ఏకంగా మొసళ్లు సైతం ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన రహదారులపైకి వచ్చి దర్జాగా అటుఇటూ పరుగులు తీస్తున్నాయి. ఈ దృశ్యాలు చూసినవారు మిన్నకుండా వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ తమ ఆందోళనను తెలియజేస్తున్నారు.

ఇంకొందరైతే ఏకంగా వీటి జీవితం ఎంత దర్జాగా ఉంది. అచ్చం బాసుల్లాగే తలెత్తుకుని తిరుగుతున్నాయి అంటూ జోకులు పేలుస్తున్నారు. ఫ్లోరిడాలోని దోరల్ ప్రాంతంలో ఆర్మాందో వాజ్ క్వెజ్ అనే వ్యక్తి తన కారులో వెళుతూ సడెన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. అందుకు కారణం ఏమిటో తెలుసా 'ఒక పెద్ద మొసలి రోడ్డుకు అడ్డంగా దర్జాగా దాటుతూ కనిపించింది. ఆ దృశ్యాన్ని పదుల సంఖ్యలో కార్లలో ఉన్నవారు చూస్తూ ఉండగా అతడు మాత్రం తన ఫోన్ లో రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. రెండు రోజుల్లోనే ఆ వీడియోను 4,60,000 మంది చూడగా అక్కడి అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement