క్రాఫ్ చెడగొట్టాడని.. తుపాకీతో కాల్చింది | Sakshi
Sakshi News home page

క్రాఫ్ చెడగొట్టాడని.. తుపాకీతో కాల్చింది

Published Thu, Feb 11 2016 11:59 AM

క్రాఫ్ చెడగొట్టాడని.. తుపాకీతో కాల్చింది - Sakshi

కాలిఫోర్నియా: అమెరికాలో విచ్చలవిడి తుపాకీ విష సంస్కృతి నుంచి ఓ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. క్రాఫ్ చెడగొట్టాడనే కోపంతో కాలిఫోర్నియాకు చెందిన ఓ యువతి తన హెయిర్ స్టయిలిస్ట్పై కాల్పులు జరిపింది. అయితే తుపాకీ జామ్ కావడంతో అతను బతికిపోయాడు.

బుధవారం శాన్ డీగోలోని ఓ బార్బర్ షాపులో ఆడ్రియన్ బ్లాంచె స్వైన్ (29) అనే యువతి హెయిర్ కట్ చేయించుకుంది. అయితే తన క్రాఫ్ బాగోలేదని ఆగ్రహం చెందిన ఆమె.. ఇంటికి వెళ్లి గన్ తీసుకుని మళ్లీ బార్బర్ షాపునకు వచ్చింది. తన క్రాఫ్ చెడగొట్టావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెయిర్ స్టయిలిస్ట్ను చంపేందుకు మూడుసార్లు తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది. తుపాకీలో బుల్లెట్లు ఉన్నా.. జామ్ కావడంతో పేలలేదని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో బార్బర్ షాపులో ఎనిమిదిమంది ఉన్నారని, ఎవరూ గాయపడలేదని తెలిపారు. మరో వ్యక్తి సాయంతో హెయిర్ డ్రెస్సర్.. ఆడ్రియన్ను బంధించి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు నిందితురాలిని ఆరెస్ట్ చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement