ప్రఖ్యాత హాలీవుడ్ తార.. ఏంజెలీనా జోలి కు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి బహిర్గతమైంది. ఆమెకే కాదు ఆమెకు సంబంధించిన ఏ వస్తువుకైనా అంతే గుర్తింపు ఉంటుందన్నిది కూడ రూఢి అయ్యింది. అమ్మకానికి పెట్టిన ఏంజెలీనా చిన్ననాటి నివాసం.. ఇప్పుడు మార్కెట్లో అత్యధిక రేటు పలికి వార్తల్లోకెక్కింది. న్యూయార్క్ దగ్గరలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రాక్ ల్యాండ్ కౌంటీ హౌస్.. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించినది. ఏంజెలీనాకు పెరిగిన క్రేజ్ లాగే ఆ నిర్మాణానికీ ఇటీవల భారీ క్రేజ్ పెరిగిపోయింది.
గతేడాది అమ్మకానికి పెట్టిన కౌంటీ హౌస్ అప్పట్లో ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 6 కోట్ల 20 లక్షలు పలుకగా... కేవలం ఒక్క ఏడాదిలోనే రెట్టింపై ఇప్పుడు రెండు మిలియన్ల డాలర్లకు పైగా.. దాదాపు రూ. 12 కోట్ల 40 లక్షల పై చిలుకు రేటుతో అమ్ముడు పోయింది. 1950 లో నిర్మించిన కౌంటీ హౌస్ ను కండక్టర్ యూజీన్ కోన్ తన స్వంతం చేసుకున్నారు. 1980 సంవత్సరం వరకూ కౌంటీ హౌస్ ఏంజెలినా తల్లి మార్చెలిన్ బెట్రాన్డ్ యాజమాన్యంలో ఉండేది.
మార్చెలిన్ ఆమె భర్త వాయ్ గెట్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఏంజెలీనా తోపాటు ఆమె సోదరుడు జేమ్స్ ను తీసుకొని బెట్రాన్డ్ లాస్ ఏంజెల్స్ కు మకాం మార్చేసింది. అప్పట్లో ఏంజెలీనా స్నెడెన్స్ ల్యాండింగ్ లోని ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండేది. నాలుగు బెడ్ రూమ్స్ ఉన్నకౌంటీ హౌస్ ను నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1950వ దశకంలో నిర్మించారు. ఏంజెలీనా ఇల్లు ఒక్క ఏడాదిలోనే రెట్టింపు రేటు పెరిగిపోయిందంటే ఆమెకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెండు మిలియన్ డాలర్లు పలికిన ఏంజెలీనా ఇల్లు..!
Published Wed, Oct 7 2015 12:02 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement