చింపాంజీలూ సీన్లు గుర్తుపెట్టుకుంటాయి! | Sakshi
Sakshi News home page

చింపాంజీలూ సీన్లు గుర్తుపెట్టుకుంటాయి!

Published Sat, Sep 19 2015 6:25 PM

చింపాంజీలూ సీన్లు గుర్తుపెట్టుకుంటాయి!

చింపాంజీలు మానవులతో దగ్గరి పోలికలు కలిగి ఉండటమే కాదు మనుషుల్లాగే సామర్థ్యం కలిగి ఉంటాయని అనేక పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. తాజాగా వాటి సామర్థ్యంపై మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చింపాంజీలు, బొనొబోలు మనుషుల్లాగే ప్రతి సీన్ ను సీక్వెన్స్ లో గుర్తుంచుకోలేకపోయినా...   సినిమాల్లోని వివిధ సన్నివేశాలను బాగా గుర్తు పెట్టుకోగలుగుతాయని జపాన్ పరిశోధకులు చెప్తున్నారు.

 ఐ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగించి చింపాంజీలు ఏ విధంగా వీడియోలను వీక్షిస్తున్నాయో రికార్డ్ చేశారట. ఓ వీడియో క్లిప్పును 24 గంటల తర్వాత  మరోసారి చూపించినప్పుడు... అవి రాబోయే సన్నివేశం ఏమిటో తెలిసినట్లుగా ప్రవర్తించడం గమనించామని జపాన్ లోని క్యోటో యూనివర్శిటీ వైల్డ్ లైఫ్ రీసెర్స్ విభాగం రచయిత ఫ్యుమిహిరో కానో చెప్పారు.

అధ్యయనకారుల బృందం 'కింగ్ కాంగ్ అటాక్'', ''రివేంజ్ టు కింగ్ కాంగ్'' అనే రెండు షార్ట్ ఫిల్మ్ లను చింపాంజీలకు చూపించగా.. అంతకు ముందు చూడని సన్నివేశాలకంటే... సినిమాలో ఒకే రకమైన వాతావరణాన్నిపోలిఉన్న సన్నివేశాలు వచ్చినపుడు అవి గుర్తించాయట! ఒక సినిమాలోని కింగ్ కాంగ్ అటాక్ చేసిన సన్నివేశం చూపించి... ఇరవై గంటల తర్వాత మరోసారి ఆ సినిమా చూపించినప్పుడు మునుపటి సన్నివేశంలో కాంగ్ వచ్చేవైపు అవి ఆత్రుతగా దృష్టిని సారించడాన్ని అధ్యయనకారులు గమనించారు.

ఒక్కసారి ఒక సన్నివేశాన్ని చూశాయంటే చాలు అవి ఇక మర్చిపోవని క్యోటో వర్శిటీ పరిశోధక బృందం సభ్యురాలు సంతోషి హిరాటా అంటున్నారు. ఈ సామర్థ్యం చింపాంజీలకు రాబోయే ప్రమాదం నివారించడానికి పలు పర్యావరణాల్లో నివసించడానికి ఉపయోగపడుతుందని అధ్యయనకారిణి హరిత అంటున్నారు.

Advertisement
Advertisement