Sakshi News home page

అంతరిక్షం నుంచి దక్షిణభారతం ఇలా..!

Published Tue, Nov 17 2015 8:38 AM

అంతరిక్షం నుంచి దక్షిణభారతం ఇలా..!

అంతరిక్షంలో చాలా కాలం నుంచి ఉంటున్న అమెరికన్ వ్యోమగామి స్కాట్ కెల్లీ మనకు మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. దాదాపు 233 రోజుల నుంచి భూమ్మీద ఉన్న వివిధ ప్రాంతాలను పై నుంచి పరిశీలిస్తున్న స్కాట్.. తాజాగా దక్షిణ భారతదేశం ఎలా ఉంటుందో చూడండి అంటూ ఓ ఫొటో తీసి, దాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. మార్చి నుంచి స్కాట్ అంతరిక్షంలోని అంతర్జాతయ స్పేస్ స్టేషన్‌లో ఉంటున్నారు.

తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచంలోని పలు ప్రాంతాల ఫొటోలను స్కాట్ పంపుతున్నారు. వరుసగా దీపాలు వెలుగుతూ ఉన్న దక్షిణ భారతదేశం ఫొటోను తీసి దాన్ని కూడా అందులో భాగంగానే ఆయన ట్వీట్ చేశారు. ప్యారిస్ నగరంపై ఉగ్రవాద దాడుల తర్వాత ఆ నగరం ఎలా ఉందో కూడా చూపిస్తూ.. ఆ ఫొటోను పంపారు.

దాదాపు ఏడాది పాటు అంతరిక్షంలో గడిపేందుకు స్కాట్ కెల్లీతో పాటు రష్యన్ వ్యోమగామి మిఖాయిల్ కొర్నియెంకో కూడా వెళ్లారు. వచ్చే ఏడాది వీళ్లిద్దరూ కజకిస్థాన్‌లో ల్యాండ్ అవుతారట.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement