దొంగదెబ్బ కొడుతున్న చైనా | Sakshi
Sakshi News home page

దొంగదెబ్బ కొడుతున్న చైనా

Published Sun, Jan 7 2018 7:26 AM

China building bunker for Pakistan along border with India - Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌-చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్‌ కంట్రీ పాక్‌కు అన్ని రకాల సహకారాలు అందిస్తోంది. తాజాగా పొరుగుదేశానికి అవసరమైన సైనిక సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా  సైనికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కమ్యూనిస్ట్‌ కంట్రీ అందిస్తోంది. కశ్మీర్‌ నుం‍చి గుజరాత్‌ వరకూ ఉన్న సరిహద్దు వెంబడి.. పాకిస్తాన్‌ సైనికుల కోసం చైనా అత్యాధునిక బంకర్లను నిర్మిస్తోంది.

కీలకమైన రాజస్తాన్‌ సరిహద్దు వద్ద ఎయిర్‌ బేస్‌ను ఆధునీకరించడంతో పాటు,  350 స్టోన్‌ బంకర్లను డ్రాగన్‌ దేశం​ నిర్మించింది. అంతేకాక బోర్డర్‌ అవుట్‌ పోస్ట్‌లను కలుపుతూ.. రోడ్‌నెర్క్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. ఒక వేళ యుద్ధం సంభవిస్తే.. సైన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు వెంబడి బంకర్స్‌తో పాటు కెనాల్స్‌కు చైనా ఏర్పాటు చేస్తోంది. 

భారత్‌ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే  ఖైరాపూర్‌ ఎయిర్‌బేస్‌లో కొన్ని నెలలుగా చైనా సైన్యం తిష్ట వేసింది. ఈ ఎయిర్‌బేస్‌ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేస్తోంది. 
ఇదిలావుండగా.. పాక్‌కు అవసరమైన సహజవాయువు, ముడిచమురు, ఖనిజ వనరులను చైనానే అందిస్తోంది. 

Advertisement
Advertisement