వైమానిక స్థావరంగా టిబెట్‌ ఎయిర్‌పోర్ట్‌ | Sakshi
Sakshi News home page

వైమానిక స్థావరంగా టిబెట్‌ ఎయిర్‌పోర్ట్‌

Published Thu, Oct 4 2018 6:34 AM

China turning Tibet airport into military airbase - Sakshi

బీజింగ్‌: టిబెట్‌ రాజధాని లాసాలోని విమానాశ్రయాన్ని చైనా మిలిటరీ ఎయిర్‌బేస్‌గా మారుస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టిబెట్‌ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న ఆ విమానాశ్రయాన్ని పౌర విమాన సేవలు అందించేందుకు ఉపయోగించాల్సి ఉండగా, చైనా సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న సంగతి భారత్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని హిందుస్తాన్‌ టైమ్స్‌ బుధవారం ప్రచురించింది. ఈ కథనంలో ముగ్గురు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రన్‌వే నుంచి అండర్‌గ్రౌండ్‌లో నిర్మించిన బాంబ్‌ప్రూఫ్‌ హ్యాంగర్స్‌(విమానాలు నిలుపు స్థలం) వరకు ‘టాక్సీ ట్రాక్‌’ నిర్మాణం పూర్తయింది. ఈ హ్యాంగర్లను 36 విమానాలు నిలిపేంత విశాలంగా నిర్మించారు. లాసా విమానాశ్రయం..ఢిల్లీ నుంచి 1350 కి.మీ దూరంలోనే ఉండటం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 

Advertisement
Advertisement