మూణ్నాళ్ల ముచ్చట.. | Sakshi
Sakshi News home page

మూణ్నాళ్ల ముచ్చట..

Published Sun, Sep 4 2016 12:29 AM

మూణ్నాళ్ల ముచ్చట..

చైనాలోని హునన్ పట్టణంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తయిన, పొడవైన (430 మీటర్లు) గాజు వంతెన మూతపడింది.. ఆగస్టు 22న ప్రారంభించిన ఈ వంతెన కేవలం 13 రోజులకే మూతపడింది. రెండు కొండల మధ్య మొత్తం గాజులతో తయారు చేసిన ఈ బ్రిడ్జి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీంతో అక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

రోజుకు 8 వేల మందిని మోయగలిగే సామర్థ్యంతో నిర్మించినా అంతకు మించి, అంటే దీనికి సుమారు 10 రెట్ల మంది పర్యాటకులు రోజూ వస్తున్నారట. దీంతో తలలు పట్టుకున్న అధికారులు చేసేదేం లేక మూసేశారు. అయితే బ్రిడ్జికి అంతర్గతంగా పలు మరమ్మతులు చేసేందుకే మూసేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ గాజు బ్రిడ్జి కథ మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో త్వరలోనే చెబుతామంటున్నారు అక్కడి అధికారులు.

Advertisement
Advertisement