గాలితో నడిచే కారు.. గంటకు 40 కి.మీల వేగం | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 9 2018 10:14 PM

Compressed Air Cars  - Sakshi

గాలితో నడిచే కారు... గంటకు నలభై కి.మీలతో  వేగంతో వెళ్లగలుగుతుంది. అదీ కూడా ఏమాత్రం నిర్వహణ ఖర్చు లేకుండానే...  ఇదేదో బావుందే... రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరల నేపథ్యంలో మన నగర రోడ్లపై నడిపేందుకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా ?

ఈజిప్ట్‌లోని హెల్వన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థుల బృందం తమ ‘గ్రాడ్యువేషన్‌ ప్రాజెక్టు’ కోసం ఆక్సిజన్‌ కంప్రెస్డ్‌ ఇంథనంతో నడిచే కారును తయారు చేసింది. దాని కోసం వారు ఖర్చు చేసింది  కేవలం 18 వేల ఈజిప్ట్‌ పౌండ్లు ($1,008.40 డాలర్లు) మాత్రమే. సాధారణంగా ‘గో కార్టింగ్‌’ రేసులో ఉపయోగించే కారును పోలిన విధంగా రూపొందించిన ఈ కారులో ఓ వ్యక్తి మాత్రమే (ప్రోటో టైపు వన్‌ పర్సన్‌ వెహికిల్‌) ప్రయాణించగలరు. ఈ కారు కేవలం గాలితోనే నడవడం వల్ల దీని వల్ల కాలుష్యం సమస్య తలెత్తే అవకాశమే లేదు. తమ కారు గంటకు 40 కి.మీ వేగంతో నడుస్తుందని, మళ్లీ ‘ఆక్సిజన్‌ ఇంథనం’ నింపుకునేలోగా 30 కి.మీ ప్రయాణించగలుగుతుందని ఆ విద్యార్థులు చెబుతున్నారు. గాలిని కాంప్రెస్‌ చేసి ఇంథనంగా  ఉపయోగించడం వల్ల కారు నిర్వహణ ఖర్చు అసలు ఉండదు. పెట్రోల్‌ లేదా డీజిల్‌ ఉపయోగించని కారణంగా ఈ ఇంథనాన్ని చల్లబరచాల్సిన (కూలింగ్‌) చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఈ కారు డిheజైన్‌లో సహకరించిన విద్యార్థి మహ్మద్‌ యాసిర్‌ చెబుతున్నారు.

ప్రస్తుతం గంటకు 40 కి.మీ ఉన్న ఈ వాహన వేగాన్ని వంద కి.మీ కు పెంచగలుగుతామని, మళ్లీ ఇంథనంగా గాలిని నింపుకునే లోగా 100 కి.మీ ల వరకు ప్రయాణించేలా చేయగలమనే విశ్వాసాన్ని ఈ విద్యార్థులు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాము రూపొందించిన  కారును పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణలో ఈ బృందం నిమగ్నమైంది.

Advertisement
Advertisement