ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా | Sakshi
Sakshi News home page

దేశం కోసం: డెన్మార్క్‌ ప్రధాని పెళ్లి వాయిదా

Published Fri, Jun 26 2020 11:16 AM

Danish PM Postpones Wedding Third Time - Sakshi

కోపెన్‌హాగెన్‌ : పెళ్లి కోసం లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడటం, ఇళ్ల నుంచి పారిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో డెన్మార్క్‌ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్‌సన్‌ దేశం కోసం మూడోసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఐరోపా సమాఖ్య సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం జరగాల్సిన తన వివాహాన్ని మరోసారి వాయిదా వేశారు. గతంలో కోవిడ్‌-19 విజృంభణ, లాక్‌డౌన్‌ల కారణంగా ఆమె వివాహం రెండుసార్లు వాయిదాపడింది.  "ఈ అద్భుతమైన వ్యక్తిని మనువాడేందుకు ఎంతగానో వేచి చూస్తున్నా’ అంటూ తన కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫోటోను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

త్వరలోనే తాము ఒకటవుతామని స్పష్టం చేశారు. వివాహం విషయంలో అతను కూడా చాలా ఓపికగా వేచిచూస్తున్నారని చెప్పుకొచ్చిన ఆమె ఐరోపా సమాఖ్య సమావేశాలు డెన్మార్క్ ప్రయోజనాలకు అత్యంత కీలకమని చెప్పారు. ‘వేచిచూడటం అంత సులభం కాదు..మేం ఒక్కటి కావాలనుకున్న శనివారమే బ్రసెల్స్‌లో సమావేశం ఏర్పాటు చేశారు..డెన్మార్క్‌ ప్రజల ప్రయోజనాలు కాపాడే కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉన్నందున వివాహ తేదీలను మార్చుకోవాల్సి వచ్చింద’ని మిట్టే పేర్కొన్నారు. చదవండి : డీఎన్‌ఏ గీసిన బొమ్మ

Advertisement
Advertisement