ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్లు.. | Sakshi
Sakshi News home page

ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్లు..

Published Mon, Jun 6 2016 7:55 AM

ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్లు.. - Sakshi

లండన్: ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందనే సామెత ఈ కుక్కకు అతికినట్లు సరిపోతుంది. బ్రిటన్ కు చెందిన ఫ్రేయా అనే కుక్కకు హాలీవుడ్ లో ‘న్యూ ట్రాన్స్ ఫార్మర్స్’ అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ కుక్క 6 సంవత్సరాల నుంచి ఒక జంతువుల షెడ్డులో ఉంటోంది. ఫ్రేయాను పెంచుకోవడానికి 18,000 మంది నిరాకరించారు. న్యూ ట్రాన్స్ ఫార్మర్స్ చిత్ర దర్శకుడు మైఖేల్ బే మాట్లాడుతూ.. ఫ్రేయా ఈ చిత్ర సంపాదనతో జంతువుల షెడ్డులో జీవితాంతం జీవించగలిగే డబ్బు సంపాదిస్తుంది.

ఈ పాత్రలో నటించిన తర్వాత ఆ కుక్క తిరిగి తన ఇంటిని గుర్తించకపోతే, తన దగ్గరే పెంచుకుంటానని ఆయన తెలిపారు. మైఖేల్ బే ద్వారా ఫ్రేయా ఫేస్బుక్లోనూ దర్శనమిచ్చింది. ఫ్రేయా తిరిగి తన నివాసానికి చేరుకుంటుందని ఫ్రెష్ఫీల్డ్స్ యానిమల్ రెస్క్యూ సెంటర్    సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రేయా అందమైన కుక్కే కాక మంచి విశ్వాసం కలదని ఆ కుక్క నివసిస్తున్న షెల్టర్ ఫండ్రైజర్ తెలిపారు.

Advertisement
Advertisement