'ట్రంప్ అన్ఫిట్' | Sakshi
Sakshi News home page

'ట్రంప్ అన్ఫిట్'

Published Fri, Jun 3 2016 8:38 AM

'ట్రంప్ అన్ఫిట్' - Sakshi

వాషింగ్టన్/కాలిఫోర్నియా: వివాదాస్పదుడిగా ముద్రపడినా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ పై అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయం చేసుకున్న ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు కురిపిస్తుంటే, మద్దతుదారులు బాసటగా నిలుస్తున్నారు.

అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ అన్నారు. ఆయన చెబుతున్న విదేశాంగ విధానాలు నిర్లక్ష్యపూరితంగా, బాధ్యతారహితంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి ట్రంప్ తగడని అమెరికా, ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఆయన ఆలోచనలు ప్రమాదకరమని, అసంబద్ధమని కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో మాట్లాడుతూ హిల్లరీ వ్యాఖ్యానించారు.

మరోవైపు ట్రంప్ కు రిపబ్లికన్ హౌస్ స్పీకర్ పాల్ రియాన్ మద్దతు ప్రకటించారు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కే ఓటు వేస్తానని ఆయన వెల్లడించారు. గతంలో పలుమార్లు ట్రంప్ పై ఆయన విమర్శలు గుప్పించారు.

Advertisement
Advertisement