Sakshi News home page

జిన్నా ఇంటిని కూల్చొద్దంటూ పాక్‌ వేడుకోలు

Published Thu, Mar 30 2017 6:29 PM

జిన్నా ఇంటిని కూల్చొద్దంటూ పాక్‌ వేడుకోలు - Sakshi

ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌): పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నా ఇంటిని కూల్చొద్దంటూ పాకిస్తాన్‌, భారత ప్రభుత్వాన్ని వేడుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే దానిని కూల్చి ఆస్థలంలో  మరో బిల్డింగ్‌ను నిర్మించాలని ప్రతిపాదన తేవడంతో పాక్‌ వెంటనే అప్రమత్తమైంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జిన్నా ఇంటిని గౌరవించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని పాకిస్తాన్‌ అధికార ప్రతినిధి నఫీజ్‌ జాకారియా తెలిపారు.

భారతదేశ విభజన జిన్నా ఇంట్లోనే పునాది పడిందని, జిన్నా ఇల్లు విభజనకు గుర్తు అని.. అటువంటి ఇంటిని తప్పకుండా నాశనం చేయాలని బీజేపీ నేత మంగళ్‌ ప్రభాత్‌ లోథా డిమాండ్‌ చేస్తున్నారు. జిన్నా ఇల్లు దక్షిణ ముంబైలో ఉంది. ఆ ఇంటిలోనే భారత జాతి పిత మహాత్మా గాంధీతో జిన్నా  స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో సమాలోచనలు జరిపేవారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement