ఎబోలాను గుర్తించేందుకు డీఎన్‌ఏ సెన్సర్! | Sakshi
Sakshi News home page

ఎబోలాను గుర్తించేందుకు డీఎన్‌ఏ సెన్సర్!

Published Mon, Nov 17 2014 2:26 AM

ఎబోలాను గుర్తించేందుకు డీఎన్‌ఏ సెన్సర్! - Sakshi

భారత సంతతి విద్యార్థి బృందం ఆవిష్కరణ

మెల్‌బోర్న్: ఒక చుక్క రక్తాన్ని గాజు స్లైడ్‌పై వేసి ఓ చిన్న పరికరంలో ఉంచితే చాలు.. ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఉనికిని ఇట్టే నిర్ధారించుకోవచ్చు. ఎబోలాతో పాటు ఇంకా అనేక ప్రమాదకర వైరస్‌లు, బ్యాక్టీరియాలను గుర్తించేందుకూ ఉపయోగపడే అతి చౌకైన డీఎన్‌ఏ సెన్సర్‌ను ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి విద్యార్థితో కూడిన బృందం ఆవిష్కరించింది.

స్మార్ట్‌ఫోన్ లేదా ఓ చిన్న పరికరంతో ఈ బయో సెన్సర్ పనిచేస్తుంది. అందుకే సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అనిరుధ్ బాలచందర్‌తో పాటు మరో ఐదుగురు విద్యార్థులు రూపొందించిన ఈ బయో సెన్సర్‌కు ‘హార్వార్డ్ బయోమాడ్ కాంపిటీషన్’లో అవార్డు దక్కింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement