వింత: డేటింగ్‌ కోసం స్పెషల్‌ కోర్సు | Sakshi
Sakshi News home page

వింత: డేటింగ్‌ కోసం స్పెషల్‌ కోర్సు

Published Sun, Nov 19 2017 2:37 PM

Education in Dating new course started  in china - Sakshi - Sakshi

వింతలకు విచిత్రాలను కేరాఫ్‌ అడ్రస్‌ చైనా.. కొత్త కొత్త విధానాలను ప్రవేశపెట్టడంలో చైనీయులు ముందుంటారు. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదవడానికి కోర్సులు ఉన్నట్లే ప్రేయసి, ప్రియుడు లేనివారికోసం కూడా ప్రత్యేక కోర్సులు చైనీయులు నడుపుతున్నారు. అదే డేటింగ్‌ కోర్సు. అంతేకాదు ఈకోర్సు చేసిన వారిలో 90శాతం మందికి జీవిత భాగస్వాములు దొరికారంట.

చైనకు చెందిన ఝాంగ్‌ మైండాంగ్‌ అనే వ్యక్తి 2012లో ప్రేమలో విఫలయ్యాడు. ఆబాధ నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలే చేశాడు. అయితే తిరిగి ప్రేమలో పడితేనే కోలుకోగలడు భావించాడు. అంతే కాకుండా తనలాంటి వాళ్లు గురించి ఆలోచించాడు. ప్రేయసి/ప్రియుడు కోసం వెతుక్కొనే వారికి ఓ ప్రత్యేక కోర్సు ప్రారంభించాలని భావించాడు. ఇందుకోసం 2014లో తూర్పు చైనాలోని జినాన్‌ నగరంలో ఝాంగ్‌ మైండాంగ్‌ ప్రత్యేకంగా పాఠశాల ప్రారంభించాడు. అంతేకాకుండా ఇంటర్నెట్‌లో కూడా శిక్షణ ఇస్తున్నాడు. ఇందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కోర్సులో భాగంగా మొదట వారి వేషధారణ, జీవన శైలిలను మార్చుతారు. అనంతరం వారి అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను అందిస్తారు. ఇద్దరికీ నచ్చితే లాంగ్‌ రిలేషన్‌ ఏర్పడే విధంగా శిక్షణ ఇస్తారు. ఇందులో థియరీ క్లాసులతో పాటు, ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ ఫోటోల కోసం ఫోటో సెషన్లు, సెల్ఫీ క్లాసులు, ప్రత్యేకంగా ఉంటాయి. ఆన్‌లైన్‌ తరగతుల కోసం 45 డాలర్ల నుంచి ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కరికీ పర్సనల్‌గా చెప్పడానికి మూడు వేల డాలర్లు ఫీజుగా తీసుకుంటాడు. ఇటేవలే ఇతర నగరాల్లో బ్రాంచ్‌లకు కూడా ఏర్పాటు చేశాడు. 'ఫాల్‌ ఇన్‌ లవ్‌ ఎమోషనల్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో ప్రారంభించిన ఈపాఠశాలలో ఇప్పుడు 300 మంది శిక్షణ తీసుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement