ఇంతవరకూ చూడని విమానం..! | Sakshi
Sakshi News home page

ఇంతవరకూ చూడని విమానం..!

Published Sun, Apr 1 2018 4:42 PM

Emirates Airlines Announced Boeing 777X Made Everyone Fools - Sakshi

దుబాయ్‌ : గల్ఫ్‌ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ కొత్త బోయింగ్‌ విమానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఇది సాధారణ విమానం కాదు. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి విమానం లేదు. దానిపై కప్పు మొత్తం గాజుతో చేసిందట. సాధారణంగా ఏ విమానంలో అయిన చిన్న కిటికిలోంచి మాత్రమే బయటికి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బోయింగ్‌ 777ఎక్స్‌లో ప్రయాణిస్తూ అందమైన ఆకాశం, విమానాన్ని ఢీ కొడుతున్నట్లు కనిపించే మబ్బులను వీక్షించవచ్చంటూ ఎమిరేట్స్‌ సంస్థ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఆ విమానానికి సంబంధించిన ఫోటోలను ఫోస్ట్‌ చేసింది.

ఈ విమానాలను 2020 కల్లా అందుబాటులోకి తెస్తున్నట్టు కూడా సంస్థ వెల్లడించింది. ఫోటోలు చూసి, వివరాలు చదివిన జనాలు ఇక ఎంచక్క ఆ విమానంలో ఎగిరి ఆకాశపు అందాలను చూద్దాం అంటూ కలలు కన్న వారిని నిద్ర లేపినట్టు ఈ రోజు ఏప్రిల్‌ ఒకటి అంటే ‘ఫూల్స్‌ డే’ అంటూ అందర్ని ఫూల్స్‌ని చేసేసింది. గతేడాది కూడా ఈ సంస్థ ఇలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం తెస్తున్నామని ప్రకటించింది. దాని పేరును ఏపీఆర్‌001 గా చెప్పి అందులో స్విమ్మింగ్‌ పూల్‌, ఆటల గది, పార్కు, జిమ్‌ ఉంటాయంటూ అందర్ని ఫూల్స్‌ చేసింది.

Advertisement
Advertisement