ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త. ఫేస్ బుక్ లో ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఉద్యోగులు (పురుషులు) నాలుగు నెలల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మినహా ఇతర ప్రాంతాల్లో ఇంతకు ముందు నాలుగువారాలు మాత్రమే ఉన్న పితృత్వ సెలవు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్నవారందరికీ నాలుగు నెలల పాటు మంజూరు చేసింది.
ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్.. సోషల్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న తండ్రులంతా తమ శిశువులతో బంధాన్ని పెంచుకునేందుకు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచీ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. 'మా పేరెంటల్ లీవ్ పాలసీస్ కు అనుగుణంగా మేమీ నిర్ణయం తీసుకున్నాం' అని ఫేస్ బుక్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి లోరీ మెట్లాఫ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సెలవులను పిల్లలు పుట్టిన తర్వాత లేదా దత్తత తీసుకున్న సంవత్సరం లోపు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫేస్ బుక్ ఇప్పటికే శిశువుల పెంపకానికి సహాయంగా ఇరవై లక్షల రూపాయల వరకూ బోనస్ ను కూడా అందిస్తోంది.
గత నెల్లో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్.. తన భార్య ప్రిసిల్లా మొదటి సంతానానికి జన్మనివ్వడంతో రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే... పిల్లలు పుట్టిన సమయంలో వారితో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని అధ్యయనాలు కూడ చెబుతున్నాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ఉద్యోగులు వారికిచ్చే నాలుగు నెలల పెటర్నిటీ, లేదా మెటర్నిటీ సెలవును సంవత్సరం లోపు వారికి అవసరమైన విధంగా విడదీసి వాడుకునే వీలు కల్పిస్తోంది.
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త
Published Sat, Nov 28 2015 7:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement