బాంబర్లు, జెట్‌ విమానాలతో చైనా బల ప్రదర్శన | Sakshi
Sakshi News home page

బాంబర్లు, జెట్‌ విమానాలతో చైనా బల ప్రదర్శన

Published Sun, Jul 30 2017 3:52 PM

బాంబర్లు, జెట్‌ విమానాలతో చైనా బల ప్రదర్శన

బీజింగ్‌: ఆధునిక జెట్ విమానాలు, సైనికుల కవాతుతో 90వ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవాన్ని చైనా ఆదివారం ఘనంగా జరుపుకుంది. జెట్‌ విమానాలు, ఎచ్‌-6కె బాంబర్లు, జె-15 ఫైటర్స్‌ లతో ఘనంగా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్‌ సమక్షంలో చైనా జరుపుకుంది. ఈ సందర్భంగా మంగోలియా ప్రాంతంలోని సైనిక దళాల శిక్షణా స్థావరాలను జిన్‌పింగ్‌ పర్యవేక్షించారు. యుద్ధ ట్యాంకులు, క్షిపణి లాంచర్లు, ఇతర సైనిక వాహనాలతో వేలాది దళాలు కవాతు నిర్వహించాయి. ఈసందర్భంగా జిన్‌పింగ్‌ "హలో కామ్రేడ్స్‌ మీరు దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రజలకు సేవచేయండి, ప్రభుత్వంతో నడవండి, గెలవడం కోసం పోరాడండి, ఇతరులకు ఆదర్శంగా నిలవండి" అంటూ ప్రసంగిచారు. ఈ సైనిక కవాతు కార్యక్రమాన్ని చైనా మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

సాధారణంగా ఆగస్టు 1న సైనిక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సి ఉంది. కానీ మొదటిసారి సైనిక దినోత్సవాన్ని ముందుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిన్‌పింగ్‌ తొలిసారి పర్యవేక్షించారు. చైనా సైన్యం ప్రపంచంలోనే అత్యంత చురుకైనదని, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం ఉందని ఆయన తెలిపారు. దశాబ్దాల కాలం నుంచి చైనా ఏ పొరుగు దేశంతో యుద్ధం చేయలేదని, ఏఒక్కరితో శత్రుత్వం లేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంపై ఉందన్నారు. చైనా సైనిక ఆధునీకరణపై దృఢమైన వైఖరితో ఉంది. ప్రపంచంతోపాటు ఆసియా దేశాల్లో బలమైన సాయుధ బలగాలతో బలంగా ఉంది. అయితే మిలిటరీ సంస్కరణల్లో కొన్ని వివాదాలు నెలకొని ఉన్నాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ బలగాలు చైనా సొంతం.

Advertisement
Advertisement