Sakshi News home page

లంచం కేసులో గోవా మాజీ మంత్రి చర్చిల్ అరెస్ట్

Published Thu, Aug 6 2015 1:31 AM

Former Goa minister Churchill Alemao arrested by crime branch in Louis Berger bribery case

పనాజీ: లూయీస్ బెర్గర్ లంచం కేసులో గోవా మాజీ మంత్రి చర్చిల్ అలెమోను అరెస్ట్ చేసినట్టు అవినీతి నిరోధక శాఖ బుధవారం అర్థరాత్రి వెల్లడించింది.  గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లూయీస్ బెర్గర్ కంపెనీ, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు లంచంగా దాదాపు రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ ప్రాంగణంలో ప్రశ్నించిన ఆయన్ను అవినీతి నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే 2010 లో గోవాలో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి, సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టుల్లో ఈ ముడుపుల వ్యవహారం చోటుచేసుకుంది.

ముందస్తు బెయిలుకు కామత్ అప్పీలు
లంచం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ ముందస్తు బెయిల్ కోసం గోవా స్థానిక కోర్టును ఆశ్రయించారు. 2010లో గోవాలో తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి పారుదల పైప్‌లైన్ నిర్మాణ ప్రాజెక్టు కన్సల్టెన్సీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు న్యూజెర్సీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ లూయీస్ బెర్గర్ ఒక మంత్రికి లంచం ఇచ్చినట్టు ఇటీవల ఆమెరికా కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కామత్‌ను పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం జిల్లా, సెషన్స్ కోర్టులను ఆశ్రయించారు.

Advertisement
Advertisement