జర్మనీ అధ్యక్షుడిగా ట్రంప్‌ వ్యతిరేకి! | Sakshi
Sakshi News home page

జర్మనీ అధ్యక్షుడిగా ట్రంప్‌ వ్యతిరేకి!

Published Mon, Feb 13 2017 1:11 AM

జర్మనీ అధ్యక్షుడిగా ట్రంప్‌ వ్యతిరేకి! - Sakshi

బెర్లిన్ : జర్మనీ అధ్యక్షుడిగా,  విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టీన్ మీయర్‌ (61) ఆదివారం ఎన్నికయ్యారు. ట్రంప్‌ బద్ధ వ్యతిరేకిగా పేరున్న స్టీన్ మీయర్‌కు జర్మనీలో మోస్ట్‌ పాపులర్‌ రాజకీయ నాయకుడిగా పేరుంది. మొత్తం 1,239 ఓట్లు పోలవ్వగా స్టీన్ మీయర్‌కు 931 ఓట్లొచ్చాయి. చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్స్‌ పార్టీ తమ అభ్యర్థిని నిలపనప్పటికీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చింది.

ఆ అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్‌పై స్టీన్ మీయర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ’ద్వేషాన్ని రెచ్చగొట్టేవాడు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ విజయం సాధించిన వెంటనే.. అమెరికాతో జర్మనీ సంబంధాలు కఠినతరం కానున్నాయని తన సన్నిహితులతో చెప్పారు.

Advertisement
Advertisement