తీరానికి మృత దేహాలతో పడవలు | Sakshi
Sakshi News home page

తీరానికి మృత దేహాలతో పడవలు

Published Wed, Dec 2 2015 7:10 PM

తీరానికి మృత దేహాలతో పడవలు - Sakshi

టోక్యో: మృత దేహాలతో తమ దేశ సముద్రతీరంలోకి వస్తున్న పడవలతో జపాన్ కలవరపడుతోంది. మృతదేహాలతో నిండిన పడవలు జపాన్ సముద్ర తీరంలోకి గత రెండు నెలలుగా కొట్టుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 12 చెక్క పడవల్లో మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.  కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మొత్తం 22 మృతదేహాలను అందులోంచి వెలికి తీశారు.

ఒక పడవలో లభించిన రెండు మృత దేహాలకు తలలు కూడా లేవు. మరో పడవలో మొత్తం 6 పుర్రెలు లభ్యమయ్యాయి. మొదటి పడవ అక్టోబర్లో  సముద్రతీరంలోకి రాగా, నవంబర్, డిసెంబర్లో మరిన్ని వచ్చాయి. ఈ మిస్టరీ బోట్లకు సంబంధించి..అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, అందులోని వారంతా ఎలా మరణించారు, అన్న కోణంలో జపాన్ కోస్ట్ గార్డు అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

ఒక బోటు పై ఉత్తర కొరియా అక్షరాల్లో 'కొరియన్ పీపుల్స్ ఆర్మీ' అని రాసిఉంది. మరో బోటులో చినిగి పోయి, చీకిపోయి ఉన్న ఒక గుడ్డ ముక్క లభించింది. అది ఉత్తర కొరియా జాతీయ జెండాగా భావిస్తున్నారు. దీంతో ఈ బోట్లన్ని ఉత్తర కొరియా నుంచి వచ్చినట్టు జపాన్ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement