దంపతులకు జిరాఫీ షాక్‌..!! | Sakshi
Sakshi News home page

దంపతులకు జిరాఫీ షాక్‌..!!

Published Tue, Apr 10 2018 10:03 AM

Giraffe Shatters Car Window In Safari Park - Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : విహారయాత్రకు వెళ్లిన ఓ జంటకు జిరాఫీ షాక్‌ ఇచ్చింది. సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ జంట కారుకు చేరువలో ఉన్న జిరాఫీని చూస్తోంది. జిరాఫీ కూడా వారి వైపు చూడటంతో దంపతులు తొలుత ఉత్సాహపడ్డారు. కారు అద్దం సగం తెరచి ఉండటంతో అక్కడికి వచ్చిన జిరాఫీ తల లోపలికి దూర్చింది.

దీంతో భయాందోళనలకు గురైన దంపతులు పెద్ద పెట్టున కేకలు వేశారు. జిరాఫీ ఒక్కసారిగా తల బయటకు తీయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఇంగ్లండ్‌లోని వార్సెస్టర్‌షైర్‌లో గల పశ్చిమ మిడ్‌ల్యాండ్స్‌ సఫారీ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతువులకు ఆహారం అందించేందుకు కారు అద్దాలను సగం తెరచివుంచడానికి సఫారీ అనుమతి ఇస్తుంది.

దంపతుల చేతిలో తినుబండారాలు ఉండటంతోనే జిరాఫీ తల లోపలికి పెట్టిందని సఫారీ అధికారులు తెలిపారు. ఘటనలో జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.

Advertisement
Advertisement