విశ్వవిద్యాలయంపై సాయుధుల దాడి: 21 మంది మృతి | Sakshi
Sakshi News home page

విశ్వవిద్యాలయంపై సాయుధుల దాడి: 21 మంది మృతి

Published Thu, Apr 2 2015 8:30 PM

విశ్వవిద్యాలయంపై సాయుధుల దాడి: 21 మంది మృతి

నైరోబీ: కెన్యాలో గరిస్సా విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజీ వసతి గృహాల్లోకి సాయుధులు చొరబడి విచక్షణ రహితంగా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21కు చేరింది. ఈ ఘటనలో 65 మందికి పైగా విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులతో ఉలిక్కిపడిన పోలీసులు భద్రతా సిబ్బంది విశ్వవిద్యాలయానికి రక్షణ వలయంగా మారారు. ఇప్పటికే సాయుధులు వర్సిటీ ప్రాంగణంలోకి చొరబడగా వారిని అదుపులోకి తీసుకునేందుకు రక్షణ బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. 600 మంది విద్యార్థులను తీవ్ర వాదులు బందీలుగా పట్టుకోవడమే కాకుండా, మృతి చెందిన ఇద్దరు గార్డులను తమ అధీనంలోకి తీసుకున్నారు. కాగా, 282 మంది విద్యార్థులను అధికారులు రక్షించారు.

తూర్పు కెన్యాలో సోమాలియా సరిహద్దులో ఉండే ఈ ప్రాంతం నిత్యం ఉగ్రవాదుల దాడులకు గురౌతుంటుంది. ప్రస్తుతం దాడికి దిగినవారు అల్ కాయిదాకు చెందిన సోమాలి ఇస్లామిస్ట్ గ్రూప్ అల్ షహబ్ వాళ్లేనని రక్షణ అధికారులు భావిస్తున్నారు.  ఆయుధాలు ధరించి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ప్రవేశ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి లోపలికి ప్రవేశించారు. 

Advertisement
Advertisement