డర్రా అదమ్‌ఖేల్: అక్కడ తుపాకులు దొరుకుతాయి. చిన్నస్థాయి నుంచి ఏకే 47 తుపాకుల వరకు. ఎలా అంటే అలా.. ఎంతకంటే అంతకు.. ఓ రకంగా చెప్పాలంటే కూరగాయల మార్కెట్లో బేరమాడినట్లుగా ఆడి వాటిని సొంతం చేసుకోవచ్చు. వీటి ధర ఎంతో తెలుసా నేడు మనం కొనుగోలు చేస్తున్నా స్మార్ట్ ఫోన్స్ కంటే తక్కువ. అదే అక్కడ తుపాకుల ప్రత్యేకత. అయితే, అవన్నీ కూడా అక్కడే తయారయ్యేది. స్క్రాప్ మెటీరియల్ తో వాటిని తీర్చిదిద్దుతారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడని అనుకుంటున్నారా.. అదే డర్రా అదమ్‌ఖేల్. పాకిస్థాన్‌లోని ఓ మూరుమూల గిరిజన ప్రాంతం.
పేరుకే గిరిజన ప్రాంతం అని చెప్పినా అదొక గన్స్ బ్లాక్ మార్కెట్ల పెద్ద అడ్డ. ప్రారంభకాలంలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా కాలక్రమంలో వాటికి ఉగ్రవాదుల అండదొరకడంతో ఆ గ్రామంలో వారంతా తుపాకుల తయారీపైనే పడ్డారు. చిన్న సైజు రైఫిల్స్ నుంచి ఏకే 47 వరకు సొంతంగా తయారు చేసి అమ్ముతుంటారు. ఇది పెషావర్ కు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న గిరిజన ప్రాంతం. ఆ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం కూడా ఇదే ఊరు.
ఇక్కడ ఒక్క గన్సే కాదు.. నకిలీ సర్టిఫికెట్లు, మత్తు పదార్థాల రవాణా, డ్రగ్స్ డీలర్ షాపులు సమాజానికి ఏమేం పనికి రావో వాటన్నింటికి డర్రా పెద్ద ఆశ్రయం. దీనిపై ఎవరూ చర్యలు తీసుకోలేదా అంటే అలా జరగలేదు. ఎందుకంటే ఇది దాదాపుగా రెండు దశాబ్దాలుగా మనుగడ కొనసాగిస్తోంది. 1980లో ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించగా తొలిసారి ఉగ్రవాద సంస్థ ముజహిదీన్ ఇక్కడి నుంచి గన్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇది పూర్తి స్థాయిలో తాలిబన్ చేతిలోకి వెళ్లాక గన్స్ తయారీ ఎక్కువైంది. ఇక్కడ ఒక్కో తుపాకీ ఎంతకు లభిస్తుందో తెలుసా 67 డాలర్లు.. అంటే రూ.7 వేలు అన్నమాట.
అక్కడ స్మార్ట్ ఫోన్స్ కన్నా ఏకే 47 గన్సే చీప్
Published Thu, Jul 28 2016 3:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement