తుది ప్రైమరీలో హిల్లరీ గెలుపు | Sakshi
Sakshi News home page

తుది ప్రైమరీలో హిల్లరీ గెలుపు

Published Thu, Jun 16 2016 1:27 AM

తుది ప్రైమరీలో హిల్లరీ గెలుపు - Sakshi

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో పోటీకి రెడీ
 
 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం జరిగిన చివరి ప్రైమరీ పోటీలో హిల్లరీ క్లింటన్ ఘన విజయం సాధించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రైమరీకి మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆమె 78.9 శాతం ఓట్లు, శాండర్స్ 21.1 శాతం ఓట్లు సాధించారు.  రిపబ్లికన్ల నేత ట్రంప్‌తో హిల్లరీ పోటీపడే  ఘట్టానికి తెర లేచినట్టయింది.ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీకి చెందిన 4,763 మంది డెలిగేట్లలో హిల్లరీ 2,800 మంది, శాండర్స్ 1,832 మంది డెలిగేట్లను గెలుచుకున్నారు. నిజానికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్‌కు అవసరమైన  డెలిగేట్లను హిల్లరీ గత నెలలోనే సాధించారు. అయినప్పటికీ వచ్చే నెలలో ఫిలడెల్ఫియాలో జరిగే డెమోక్రాటిక్ కన్వెన్షన్‌లో అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థిని ప్రకటిస్తారు.  

 హిల్లరీకి మద్దతు ప్రకటించిన శాండర్స్
 వాషింగ్టన్ ప్రైమరీలో గెలిచిన వెంటనే తనకు ఓటేసిన వారందరికీ రుణపడి ఉంటానని హిల్లరీ ట్వీట్ చేశారు. ఓడిన శాండర్స్.. హిల్లరీని కలసి  మద్దతు ప్రకటించారు. ట్రంప్‌ను ఎదుర్కొనే వ్యూహంపై, పలు సమస్యలపై కూడా చర్చించినట్లు శాండర్స్ ప్రతినిధి తెలిపారు.  హిల్లరీని శాండర్స్ అభినందించారని వెల్లడించారు.

Advertisement
Advertisement