ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

Published Fri, Mar 2 2018 2:30 AM

Hope Hicks, Trump's Communications Director, to Resign - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు  మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ విశ్వాసపాత్రుల్లో ఒకరైన హోప్‌ హిక్స్‌.. వైట్‌ హౌస్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ బుధవారం హిక్స్‌ను సుమారు 8 గంటల పాటు ప్రశ్నించింది. ఈ పరిణామాలతో కలత చెందిన హిక్స్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ స్టైల్‌కు అనుగుణంగా, ఆయన విధానాలను జనంలోకి తీసుకెళ్లడంలో గత కొన్నేళ్లుగా ఆమె కీలక పాత్ర పోషించారు. హౌస్‌ కమిటీకి ఆమె ఇచ్చిన వాంగ్మూలం సందర్భంగా తన వృత్తిలో సందర్భానుసారం కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని, అయితే రష్యా ప్రమేయం గురించిన విచారణ సందర్భంగా మాత్రం తాను ఎటువంటి అబద్ధాలు చెప్పలేదని ఆమె చెప్పారు.

Advertisement
Advertisement