మీకు ఇక్కడ భోంచేసే దమ్ముందా?

25 Mar, 2018 02:04 IST|Sakshi

ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది..? అదేదో విదేశాల్లో శ్మశానం మాదిరిగా ఉందే అనుకుంటున్నారా..? మరోసారి చూడండి.. ఏమైనా మీ అభిప్రాయంలో మార్పు వచ్చిందా..? ఇది ఓ హోటల్‌.. ఇప్పటివరకు రకరకాల హోటళ్లను చూసి ఉంటారు కానీ ఇలాంటి ఓ ప్రదేశం గురించి మీరు ఎక్కడా విని ఉండకపోవచ్చు. ఎందుకంటే శ్మశానం మాదిరిగా ఈ హోటల్‌ను నిర్మించారు. దీని పేరు కిడ్‌ మాయ్‌ డెత్‌.. ఇది ఎక్కడుందంటే థాయ్‌లాండ్‌లో. ఇక్కడి ప్రతి ఏరియా శ్మశానం మాదిరిగా కనిపించేలా డిజైన్‌ చేశారు.

అంతెందుకు అందులో ఉన్నంత సేపు మనం ఓ హోటల్‌లో ఉన్నామనే అనుభూతి కన్నా ఓ శ్మశానంలో ఉన్నట్లు భయంగా ఉంటుందట. ఆఖరికి అక్కడి పూలను కూడా మృతదేహాల మీద పెట్టే పూల బొకేలతో అందంగా తీర్చిదిద్దారు. పైగా అక్కడ ఉన్న బోర్డులపై కూడా చాలా భయానకమైన వాక్యాలు రాసి ఉంటాయట. అయితే ఇదంతా ఇలా ఎందుకు చేశారంటే.. చావు గురించి తెలుసుకోవడమే కాకుండా జీవితాన్ని మరింతగా ఆస్వాదించాలనే సూక్తిని తమ కస్టమర్లకు తెలియజేసేందుకేనని చెబుతున్నారు హోటల్‌ యజమానులు.  

మరిన్ని వార్తలు