‘బౌలింగ్ పిన్స్లా ఎగిరిపడుతున్నా ఏం చేయలేకపోయా’ | Sakshi
Sakshi News home page

‘బౌలింగ్ పిన్స్లా ఎగిరిపడుతున్నా ఏం చేయలేకపోయా’

Published Fri, Jul 15 2016 11:22 AM

‘బౌలింగ్ పిన్స్లా ఎగిరిపడుతున్నా ఏం చేయలేకపోయా’

నీస్: ఫ్రాన్స్ దినోత్సవం(బాస్టిల్ డే) సందర్భంగా సంబురాలు చేసుకుంటున్న ప్రజలపైకి గుర్తు తెలియని భారీ ట్రక్కు ఏ విధంగా దూసుకొచ్చిందో.. ఆ సందర్భంలో కనిపించిన దృశ్యాలేమిటో ప్రత్యక్ష సాక్షి ఒకరు పంచుకున్నారు. ’రోడ్డుపై ట్రక్కు అందరిని ఢీకొడుతుంటే బౌలింగ్ పిన్స్లాగా వారంతా ఎగిరిపడుతుండటం నేను స్వయంగా చూశాను. ఆ సమయంలో వారి అరుపులు విన్నాను. అది నా జీవితంలో మర్చిపోలేను. మీటర్ల వ్యవధిలోనే రక్తపుటేర్లు శవాలు ఒక్కొకటిగా పడుతూ వస్తున్నాయి’ అని అలెమండ్ అనే ఒక సాక్షి తన బ్లాగ్ లో పేర్కొన్నాడు.

‘అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే జనాలు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీస్తూ కనిపించారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు పరుగెత్తండి పరుగెత్తండి అంటూ అరుస్తున్నారు. ఈలోగా గాల్లో రెండు మూడు మీటర్ల ఎత్తులో జనాలు ట్రక్కు ఢీకొనడంతో ఎగిరిపడుతున్నారు. కానీ నేను ఏం చేయలేకపోయాను. ఓ రెస్టారెంటు వద్దకెళ్లి తలదాచుకున్నాను. నేను ఆ ట్రక్కులో డ్రైవర్ని చూడలేదు.. కానీ, అది వేర్వేరు దిశలుగా వెళుతుండటం చూశాను. ఈ ఘటన తర్వాత ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లిన మార్గం వెంట ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు, గాయాలతో అరుస్తున్నవారు కనిపించారు. ఆ దృశ్యం చూసి పూర్తిగా ధైర్యం కోల్పోయాను’  అని ఆ భయానక దృశ్యాలు వివరించాడు.

Advertisement
Advertisement