బాధిత మహిళలను ఆదుకునేందుకే జన్మించా | Sakshi
Sakshi News home page

బాధిత మహిళలను ఆదుకునేందుకే జన్మించా

Published Mon, May 16 2016 10:05 AM

బాధిత మహిళలను ఆదుకునేందుకే జన్మించా - Sakshi

లాస్ ఏంజిలెస్: లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలకు సాయం చేయడానికి తాను జన్మించానని అమెరికన్ సింగర్, పాటల రచయిత స్టీవెన్ టైలర్ అన్నాడు. ఎంతోమంది అమ్మాయిలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులకు సాయం చేయడానికి టైలర్ ఓ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా బాధితులకు కావాల్సిన వనరులు సమకూరుస్తున్నాడు.

1989లో ఓ బాధిత బాలిక ఉదంతంపై టైలర్ 'జెనీస్ గాట్ ఏ గన్' అనే పాటను రాశాడు. ఆ అమ్మాయి తండ్రి వేధింపులు తట్టుకోలేక కాల్చిచంపింది. ప్రతి పదిమంది అమ్మాయిల్లో ఏడుగురు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారని టైలర్ అన్నాడు. ఇలాంటి బాధితులకు సాయం చేసేందుకే జన్మించానని, బాధితుల బాధలను పాటలుగా రాశానని చెప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement