'మా తప్పేం లేదు.. ట్రక్కులు వాళ్లే నిలిపేశారు' | Sakshi
Sakshi News home page

'మా తప్పేం లేదు.. ట్రక్కులు వాళ్లే నిలిపేశారు'

Published Thu, Oct 1 2015 12:02 PM

India rejects allegations of blockading Nepal trade checkpoint From Yoshita Singh

న్యూయార్క్: నేపాల్ సరిహద్దులోని కీలక వర్తక తనిఖీ కేంద్రాన్ని తాము మూసివేసినట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు అని భారత్ కొట్టిపారేసింది. కొత్త రాజ్యాంగం అమలు, ఆమోదం అనేది ఆ దేశ ప్రజల, ప్రభుత్వ పెద్దల నిర్ణయం తప్ప తాము అందులో ఎలాంటి జోక్యం చేసుకోబోమని తెలిపింది. కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టినప్పటి నుంచి నేపాల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో నేపాల్కు వర్తక వాణిజ్యాన్ని నిలిపివేసిందని, కీలక వర్తక స్థావరాన్ని మూసివేసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు నేపాల్ కొత్త రాజ్యాంగం పట్ల భారత్ తన స్టాండింగ్ ఏమిటో చెప్పాలని మీడియా ప్రశ్నించగా దీనికి భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ బదులిచ్చారు.

తమకు ఈ విషయంలో ఒక స్పష్టమైన ఆలోచన ఉందని, కొత్త రాజ్యాంగం విషయం పూర్తిగా నేపాల్ ప్రజల అభీష్టమని, దానిపై ఏవైన సమస్యలు వస్తే పరస్పరం అవగాహనలతో తీర్మానాలు చేసుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఇక, వస్తువుల రవాణా నేపాల్ సరిహద్దు వరకు తీసుకెళ్లడం తమ బాధ్యత అని, అక్కడి నుంచి నేపాల్లోకి తీసుకెళ్లడం వారి బాధ్యత అని చెప్పారు. తమ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయనే కారణంతో ఇప్పటికే 4,310 ట్రక్కులను సరిహద్దు వద్ద నిలిపేశారని వివరించారు. ఈ విషయాలన్నీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేపాల్ విదేశాంగ మంత్రితో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా భేటీ అయిన నేపథ్యంలో వికాస్ స్వరూప్ తెలిపారు.

Advertisement
Advertisement