‘ట్రంప్‌ ప్రజాస్వామ్యానికే పెనుముప్పు’

5 Dec, 2019 08:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధ్యక్షుడికి అండగా నిలబడటం తప్పుడు సంకేతాలు పంపుతుందని, ఇది అమెరికా భవిష్యత్‌కు మంచిది కాదని ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు ఆమె గట్టి మద్దతుదారుగా నిలిచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధ్యక్షుడిని ఇలాగే వదిలేస్తే రానున్న అధ్యక్షులు సైతం తమ సొంత రాజకీయ ప్రయోజనాలను అమెరికన్‌ ప్రజలపై రుద్దుతారని, మన జాతీయ భద్రత, ఎన్నికలు, మన ప్రజాస్వామ్యానికే ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

జ్యుడిషియరీ కమిటీ ఎదుట ట్రంప్‌ అభిశంసనపై విచారణ తొలి రోజున ప్రమీలా జయపాల్‌ ట్రంప్‌ అభిశంసనకు మద్దతుగా మాట్లాడారు. జ్యుడిషియరీ కమిటీలో ఆమె ఒక్కరే ఇండియన్‌-అమెరికన్‌ సభ్యురాలు కావడం గమనార్హం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవిని వాడుకుంటున్న అధ్యక్షుడిని సాగనంపకుంటే మనం ఎక్కువ కాలం ప్రజాస్వామ్యంలో మనగలగలేమని, నియంత పాలనలో కూరుకుపోతామని ఆమె హెచ్చరించారు. . ఉక్రెయిన్‌ కొత్త అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్‌ చేసిన ఫోన్‌ కాల్‌ కలకలం రేపడంతో అభిశంసన విచారణ ప్రధానంగా ఈ అంశం చుట్టూ సాగుతోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్‌స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్‌

నైజీరియా తీరంలో భారతీయుల కిడ్నాప్‌

సూడాన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఈనాటి ముఖ్యాంశాలు

సూడాన్‌ పేలుడు : పలువురు భారతీయులు సజీవదహనం​

వైరల్‌ : ఒక్కొక్కరు పైనుంచి ఊడిపడ్డారు..

కామాంధుడైన కన్నతండ్రిని.. కత్తితో పొడిచి

కమలా హ్యారిస్‌పై ట్రంప్‌ ట్వీట్‌.. కౌంటర్‌

యువరాజు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు.. అంతకు మించి

నా దగ్గర డబ్బు లేదు.. అందుకే: కమలా హ్యారిస్‌

ఎట్టకేలకు ‘విక్రమ్‌’ గుర్తింపు

ఈ దశాబ్దం చాలా హాట్‌ గురూ.! 

ఈనాటి ముఖ్యాంశాలు

ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!

విక్రమ్‌ల్యాండర్‌ ఆచూకీ కనుగొన్నది మనోడే!

ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!

నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం!

అమెరికాలో ఇద్దరు భారత విద్యార్ధుల మృతి

దంతాలు మూడుసార్లు తోముకుంటేనే..

రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!

నటి అత్యాచార వీడియో లీక్‌

సిమ్‌ కావాలంటే ముఖం స్కాన్‌ చేయాల్సిందే

వయసు 23.. పారితోషికం 18 లక్షలు

వైరల్‌ : ఈ గుర్రం టీ తాగందే పని మొదలుపెట్టదు!

ఈనాటి ముఖ్యాంశాలు

మొబైల్‌ సర్వీస్‌ పొందాలంటే ఫేస్‌ స్కాన్‌ చేయాల్సిందే !

ఆ యాప్‌ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి!

విమానం కుప్పకూలి 9 మంది మృతి

లండన్‌ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే

పరోక్ష యుద్ధంలోనూ పాక్‌కు ఓటమే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌

కథే హీరో అని నమ్ముతా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా.. ఆ సినిమాలో విలనా !