తుపాకీతో ఆట.. యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

తుపాకీతో ఆట.. యువకుడి మృతి

Published Tue, Jun 16 2015 6:30 PM

తుపాకీతో ఆట.. యువకుడి మృతి - Sakshi

వాషింగ్టన్: ప్రమాదకర ఓ ఆటలో భారత సంతతికి చెందిన పద్దెనిమిదేళ్ల యువకుడు మృతిచెందాడు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమెరికాలోని టెక్సాస్ లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  జస్కరన్ సింగ్ తలపై కాల్చానని నిందితుడు విక్రమ్ విర్క్ ఒప్పుకున్నాడని తెలిపారు. విర్క్ కారులో రష్యన్ రౌలెట్ట్ గేమ్లో భాగంగా విర్క్ కాల్చాడని వివరించారు.

విక్రమ్ విర్క్ వద్దకు ఓ తుపాకీతో వచ్చి గేమ్ ఆడదామని సింగ్ చెప్పాడు. నిజానికి అది బుల్లెట్లు లేని తుపాకీ అని విక్రమ్ భావించాడు. దాంతో సింగ్ ప్రతిపాదించిన ఆటకు తాను సిద్ధమన్నాడు. వెంటనే రెండు సార్లు విర్క్ తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్చాడు. విక్రమ్ విర్క్ భావించినట్టుగానే బుల్లెట్లు బయటకు రాలేదు. ఆ తర్వాత.. నీ అవకాశం అంటూ విక్రమ్ కు తుపాకీ ఇచ్చాడు. బుల్లెట్లు లేవని ముందే భావించిన విక్రమ్ ఓ రౌండ్ కాల్చాడు. రెండో సారి కూడా ట్రిగ్గర్ నొక్కాడు. ఈ సారి బుల్లెట్ దూసుకువచ్చింది. జస్కరన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఆనూహ్య సంఘనకు ఆశ్చర్యంతో పాటు భయానకి గురైన విర్క్ తన కారులో వెంటనే జస్కరన్ను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే జస్కరిన్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుప్రతి యాజమాన్యం విక్రమ్ కారులో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మొదట సింగ్ తనని తాను కాల్చుకున్నాడని చెప్పిన విర్క్, ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టాడు. విర్క్ కు మరణశిక్షతో పాటు 1.5 లక్షల డాలర్ల జరిమానా విధించింది.

Advertisement
Advertisement