యూఎస్‌లో భారత్‌ బీపీఓల కుంభకోణం...

8 Sep, 2018 22:45 IST|Sakshi

అమెరికాలో చోటు చేసుకున్న లక్షలాది డాలర్ల కుంభకోణంలో ఐదు ఇండియన్‌  బీపీఓ కంపెనీలు, ఏడుగురు భారతీయుల ప్రమేయం ఉందని అక్కడి జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ తేల్చింది. రెండువేల మందికి పైగా అమెరికా పౌరులను మోసగించిన ఈ కేసులో బాధితులకు దాదాపు 60 లక్షల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు వెల్లడైంది. ఓ ఆధునాతన పథకం ద్వారా అమెరికన్లను మోసగించినట్టు,  అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్ల నెట్‌వర్క్‌తో పాటు  భారత్‌లోని  సహకుట్రదారులు ఈ పథకాన్ని రచించినట్టు  ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో మొత్తం 15 భాగస్వాములు (ఏడుగురు ఇండియన్లతో సహా), భారత్‌లోని ఐదు కాలుసెంటర్లు పాలుపంచుకున్నట్టు స్పష్టమైంది. అక్కడి అధికారులు ఏడుగురు భారతీయులను ఇప్పటికే అరెస్ట్‌  చేశారు.

ఇదీ ఆపరేషన్‌...
2012–16 మధ్యకాలంలో జరిగిన ఈ కుంభకోణాన్ని అమెరికా పరిశోధనా బందం చేధించింది. సంక్షిష్టమైన ఆర్థిక లావాదేవీల్లోని చిక్కుముళ్లను జాగ్రత్తగా విప్పి, చట్టవ్యతిరేకంగా అక్కడి పౌరుల నుంచి డబ్బును బలవంతంగా వసూలు చేసిన ఖండాంతరకుట్రను భగ్నం చేసింది. అమెరికాలోని డేటా బ్రోకర్లు, ఇతర వనరుల ద్వారా సేకరించిన సమాచారంతో ఆయా లొసుగులను బట్టి ఆర్థికపరమైన అంశాలు, దేశపౌరసత్వం, వలస వంటి అంశాల్లో   మోసగించేందుకు అవకాశమున్న పౌరులు, వయసుపైబడిన వారిని గుర్తిస్తారు.  ఆ తర్వాత మోసపూరిత పద్ధతుల్లో  భారత్‌లోని కొన్ని కాల్‌సెంటర్ల ద్వారా వారికి ఫోన్‌ చేసి తాము ఇంటర్నల్‌ రెవెన్యూ  సర్వీసు (ఐఆర్‌ఎస్‌) లేదా అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ ( యూఎస్‌సీఐఎస్‌) నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. పలానా ఆర్థికలావాదేవీలో లేదా పౌరసత్వం, వలసలకు సంబంధించిన అంశాల్లో  ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ బెదిరిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పెనాల్జీలు,టాక్స్‌లు కట్టకపోతే అరెస్ట్‌లు, జైలుశిక్షకు లేదా పెద్దమొత్తంలో ఫైన్‌కు గురికావాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తారు.

డబ్బు చెల్లించేందుకు అంగీకరించిన  వారి నుంచి  పైకాన్ని తీసుకునేందుకు అమెరికాలోని సహకుట్రదారుల నెట్‌వర్క్‌ ప్రమేయం మొదలవుతుంది. ఈ విధంగా వచ్చిన డబ్బును ప్రీపెయిడ్‌ డెబిట్‌కార్డులు లేదా మనీగ్రామ్, వెస్ట్రన్‌యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ తదితర రూపాల్లో వసూలు చేశారు. దీనికి మనీలాండరింగ్‌ పద్ధతిని కూడా ఉపయోగించారు. కొన్ని సందర్భాల్లో    ‘పే డే లోన్‌ ఫోన్స్‌ స్కీమ్స్‌’ రూపంలో కూడా బాధితులను మోసగించారు. ఈ స్కీమ్స్‌ల ద్వారా ఆర్థికంగా ఎలా లాభపడవచ్చో వివరించి అమెరికన్లు ఉచ్చులో పడేలా చేశారని యూఎస్‌ అటార్నీ యుంగ్‌ జె పాక్‌ తెలిపారు.  ఇలాంటి ఫోన్‌ కుంభకోణాల వెనకున్న వారిని కనిపెట్టడంలో  తమ బంద సభ్యులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఐఆర్‌ఎస్‌ పేరిట అమెరికన్లను వంచించిన కేసులో ఐదు బీపీఓ కంపెనీలు, ఏడుగురు భారతీయులు తమ ఉద్యోగుల ద్వారా కుంభకోణానికి పాల్పడినట్టు విచారణలో తేలిందని ట్రెజరీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫర్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ జె రసెల్‌ జార్జి వెల్లడించారు.

ఆరోపణలు ఎదుర్కుంటున్న బీపీఓలు ఇవే...
అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ జాబితాలో బీపీఓలు ఇవే... ఎక్స్‌లెంట్‌ సొల్యూషన్స్‌ బీపీఓ, ఏడీఎన్‌ ఇన్ఫోటెక్‌ ప్రై వేట్‌ లిమిటెడ్, ఇన్ఫో ఏస్‌ బీపీఓ సొల్యూషన్స్‌  ప్రై వేట్‌ లిమిటెడ్, అడోర్‌ ఇన్ఫోసోర్స్‌ ఇన్‌కార్పొరేషన్, జ్యురిక్‌ బీపీఓ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ .

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికా డ్రీమ్స్‌ కరిగిపోతాయా?

చైనా బలహీనతకు ట్రేడ్‌వార్‌ కారణమా?

అమెరికాలో స్వామీజీపై దాడి

జలుబు మంచిదే.. ఎందుకంటే!

వేడితో కరెంటు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా