ఆ హత్య.. ఓ మెంటల్ పేషంట్ పని! | Sakshi
Sakshi News home page

ఆ హత్య.. ఓ మెంటల్ పేషంట్ పని!

Published Mon, Oct 31 2016 10:59 AM

మన్‌మీత్ అలిషర్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని బిస్బేన్ నగరంలో పంజాబ్‌కు చెందిన బస్సు డ్రైవర్ మన్‌మీత్ అలిషర్(29) ఇటీవల దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడిన 48 ఏళ్ల ఎడ్వర్డ్‌ ఒడొనోహు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   అయితే ఒడొనోహు ఓ మెంటల్ పేషంట్ అని క్వీన్స్‌లాండ్ హెల్త్ మినిస్టర్ కామెరూన్ డిక్ వెల్లడించారు. ఒడొనోహు గతంలో క్వీన్స్‌లాండ్ మెంటల్ హెల్త్ సర్వీస్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నాడని ఆయన తెలిపారు. అతడికి అందించిన ట్రీట్‌మెంట్ విషయాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు.

బ్రిస్బేన్‌ సిటీ కౌన్సిల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న మన్‌మీత్ అలిషర్‌పై మండే స్వభావమున్న మొలొటోవ్ కాక్‌టైల్ లాంటి ద్రవాన్ని పోయడంతో మంటలంటుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మన్‌మీత్ మంచి పంజాబీ సింగర్‌కూడా. మన్‌మీత్ సోదరుడు అమిత్ అలిషర్ మాట్లాడుతూ.. సోదరుడి హత్య కేసులో తమకు న్యాయం జరగాలన్నారు. కుటుంబంలో మన్‌మీత్ కీలకమైన వ్యక్తి అని, అతడి మరణవార్తను ఇంకా తల్లిదండ్రులకు చెప్పలేదన్నారు. అలిషర్ హత్యను భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో మోదీ మాట్లాడారు. అయితే.. ఇది జాత్యహంకార, తీవ్రవాద చర్య కాదని ఆస్ట్రేలియా అధికారులు స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement