ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు స్థూలకాయులే! | Sakshi
Sakshi News home page

ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు స్థూలకాయులే!

Published Sun, Jan 5 2014 2:02 AM

Indians adding to world obesity problem

లండన్: పాశ్చాత్య ధనిక దేశాల్లోనే స్థూలకాయులు ఎక్కువగా ఉంటున్నారని ఇంతవరకూ భావిస్తుండగా.. భారత్‌లాంటి మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే సమస్య ఎక్కువ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు స్థూలకాయంతో లేదా అధిక బరువుతో ఉన్నట్లు కూడా లండన్‌కు చెందిన ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం స్థూలకాయులు, అధిక బరువుతో ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 146 కోట్ల మంది వరకూ ఉన్నారని తెలిపింది. మధ్యస్థ ఆదాయ దేశాలైన భారత్, చైనా, ఈజిప్టు, పెరూ, థాయిల్యాండ్‌లలో గత 50 ఏళ్లలో ఆహారంలో వచ్చిన మార్పులను కేస్‌స్టడీల ఆధారంగా అధ్యయనం చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 1980 నుంచి 2008 మధ్యలో స్థూలకాయం, అధిక బరువు ఉన్నవారి శాతం 9 నుంచి 11 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement