ఫేస్‌బుక్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో..! | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో..!

Published Sat, Jul 19 2014 2:39 AM

ఫేస్‌బుక్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో..! - Sakshi

ఎంహెచ్ విమానం బయల్దేరేముందు కార్ పోన్ అనే డచ్ దేశస్తుడు.. ఆ విమానాన్ని ఫొటో తీసి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దానికింద ‘ఒకవేళ ఈ విమానం కనపించకుండా పోతే.. ఆ విమానం ఇలా ఉండేదని చెప్పేందుకు’ అంటూ ఒక కామెంట్ పోస్ట్ చేశాడు. మలేసియాకు చెందిన మొహమ్మద్ అలీ మొహమ్మద్ ప్రమాదానికి గురైన విమానం ఎక్కేముందు ఒక చిన్న వీడియో తీసి తన ‘ఇన్‌స్టాగ్రామ్’ అకౌంట్లో అప్‌లోడ్ చేశాడు. దానికింద దేవున్ని ప్రార్థిస్తూ.. నెర్వస్‌గా ఉందంటూ వ్యాఖ్య పోస్ట్ చేశాడు. తమ సామాన్లను సర్దుకుంటున్న ప్రయాణికులు ఆ వీడియోలో కన్పిస్తున్నారు.

ఎయిడ్స్ పరిశోధకుల దుర్మరణం

ఈ దుర్ఘటనలో పలువురు ఎయిడ్స్ నిపుణులు చనిపోయారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగేసదస్సుకు హాజరయ్యేందుకు వారంతా వెళ్తున్నారు. వారిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి గ్లెన్ థామస్ ఉన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ మాజీ చీఫ్ జోయెప్ లాంజ్ కూడా ఆ బృందంలో ఉన్నారు.
 
 

Advertisement
Advertisement