ఐసిస్కు ఎదురుదెబ్బ.. అద్నానీ హతం | Sakshi
Sakshi News home page

ఐసిస్కు ఎదురుదెబ్బ.. అద్నానీ హతం

Published Wed, Aug 31 2016 9:26 AM

ఐసిస్కు ఎదురుదెబ్బ.. అద్నానీ హతం - Sakshi

బీరుట్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నానీ హతమయ్యాడు. సిరియాలోని అలెప్పో ప్రావిన్స్లో అమెరికా సిరియా సంయుక్త బలగాలకు ఉగ్రవాదులకు జరుగుతున్న భీకర కాల్పులను పర్యవేక్షించేందుకు వెళ్లిన అద్నానీ సిరియా మిలటరీ ఆపరేషన్లో హతమైనట్లు బలగాలు చెప్పాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక సీనియర్ నేతను తాము లక్ష్యంగా పెట్టుకుని దాడి చేశామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే ఐసిస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 'సంయుక్త బలగాలు అల్ బాబ్ ప్రాంతంలో ఐసిస్ సీనియర్ లీడర్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఈ దాడిలో తాము సాధించిన విజయాన్ని అంచనా వేస్తున్నాము' అని అమెరికా అధికారులు ప్రకటించగా.. అద్నానీ లాంటి వారు చనిపోతే అతడిలాంటి వారు పదుల సంఖ్యలో ఐసిస్ కోసం పుడతారని ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అలెప్పో మీద పట్టుకోసం అద్నానీ ఆధ్వర్యంలోనే గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులు బలగాలపై దాడులు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement