నాడు ఫ్లూ, నేడు కరోనాను జయించింది..

6 Apr, 2020 17:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1918లో స్పానిష్‌ ఫ్లూ నుంచి బతికి బయట పడ్డ 104 ఏళ్ల ఇటలీ వద్ధ మహిళ కరోనా వైరస్‌ బారిన పడి కూడా కోలుకోవడం ఓ అద్భుతమైతే ఇప్పటి వరకు కరోనా బారిన పడి బతికి బయటపడిన వృద్ధుల్లోకెల్లా వృద్ధురాలిగా రికార్డు నెలకొల్పారు. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన ఎనిమదవ రోజు, అంటే మార్చి 17వ తేదీన కరోనా వైరస్‌ బారిన పడిన అడ జనుస్సో బయెల్లాలోని తన నర్సింగ్‌ హోంలోనే చేరారు. ('రోనా’ను రా మిలేస్తాం)

ఎడతెరపి లేకుండా వాంతులవడం, ఊపిరి ఆడకపోవడంతోపాటు జ్వరం కూడా రావడంతో ఆమెను నర్సింగ్‌ హోంలో చేరారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌ వచ్చింది. అప్పటికే కొంతమంది కరోనా రోగులు ఆ నర్సింగ్‌ హోంలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకినప్పటికీ జనుస్సో పడకకు అంకితం కాకుండా ఆమె లేచి తన వీల్‌ఛైర్‌ వరకు నడిచి అందులో కూర్చునేదని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ కార్ల ఫర్నా మార్చేస్‌ తెలిపారు. ఆమె ఈ వయస్సులో కూడా కోలుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, కరోనా బారిన పడిన ఇతర రోగులు కూడా కోలుకుంటారనే కొత్త స్పూర్తిని ఇచ్చిందని డాక్టర్‌ వ్యాఖ్యానించారు. (కరోనా: బ్రిటన్ రాణి వీడియో సందేశం)

ఇటలీలో కరోనా మతుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, గతంలో ఓ రోజున 681 మంది మరణించగా, ఇప్పుడు ఆ సంఖ్య 427కు చేరుకుందని, మృతుల సంఖ్య 21 శాతం తగ్గిందని ‘ఐఎస్‌ఎస్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ సిల్వియో బ్రుసఫెర్రో  తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలో లాక్‌డౌన్‌ను సడలించవచ్చని ఇటలీ అధికారులు తెలిపారు. (లాక్డౌన్తో రోజుకు 2.25 లక్షల కోట్ల నష్టం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు