లిబియా కొత్తప్రధాని అహ్మద్ ఓమర్ మితిగ్ | Sakshi
Sakshi News home page

లిబియా కొత్తప్రధాని అహ్మద్ ఓమర్ మితిగ్

Published Mon, May 5 2014 8:39 PM

సమావేశమైన లిబియా పార్లమెంట్

 ట్రిపోలి: లిబియా కొత్త ప్రధానిగా ఇస్లామిక్‌వాదుల మద్దతు కలిగిన వ్యాపారవేత్త అహ్మద్ ఓమర్ మితిగ్ నియమితులయ్యారు. జనరల్ నేషనల్ కాంగ్రెస్ (పార్లమెంట్) మధ్యంతర సమావేశాల్లో ఆయన నియామకం జరిగింది. 42 ఏళ్ల  మితిగ్ యువ ప్రధానిగా చరిత్ర సష్టించనున్నారు.

లిబియా నిరకుంశ నేత గడాఫీ 2011లో హత్యకు గురైన తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టనున్న ఐదవ వ్యక్తి మితిగ్.  ఆయన  15 రోజుల్లో మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారని పార్లమెంటు అధికార ప్రతినిధి చెప్పారు.  15 రోజుల్లో పార్లమెంటు విశ్వాసం కూడా పొందవలసి ఉంటుంది.

Advertisement
Advertisement