మావో వల్లే 1959 సరిహద్దు వివాదం | Sakshi
Sakshi News home page

మావో వల్లే 1959 సరిహద్దు వివాదం

Published Sun, Aug 6 2017 1:05 AM

మావో వల్లే 1959 సరిహద్దు వివాదం - Sakshi

బీజింగ్‌: భారత్, చైనాల మధ్య 1959 నాటి సరిహద్దు వివాదంలో నాటి చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ అధినేత మావో జెడాంగ్‌పై అప్పటి సోవియెట్‌ యూనియన్‌ నాయకుడు నికితా కృశ్చేవ్‌ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు మీడియాలో కథనం ప్రచురితమైంది.

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా దేశం విడిచి వెళ్లిపోయినందుకు  మావోను కృశ్చేవ్‌ నిందించినట్లు తెలిపింది. దీంతో ఈ వివాదంలో భారత ప్రధాని నెహ్రూ పాత్రపై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. 1959 సెప్టెంబర్‌ చివరలో మావో, కృశ్చేవ్‌ మధ్య జరిగిన సమావేశం వివరాలను హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. నాడు టిబెట్‌లో పరిస్థితులకూ మావోనే కారణమని కృశ్చేవ్‌ ఆయనతో చెప్పినట్లు పోస్ట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement