‘క్యూరియాసిటీ’లో లోపం.. కార్యకలాపాల నిలిపివేత! | Sakshi
Sakshi News home page

‘క్యూరియాసిటీ’లో లోపం.. కార్యకలాపాల నిలిపివేత!

Published Fri, Nov 22 2013 3:34 AM

‘క్యూరియాసిటీ’లో లోపం.. కార్యకలాపాల నిలిపివేత!

వాషింగ్టన్: అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌లో ఎలక్ట్రికల్ వ్యవస్థలో లోపం తలెత్తింది. దీంతో ఆ శోధక నౌక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నవంబర్ 17న రోవర్‌లోని అన్ని భాగాలకూ విద్యుత్‌ను సరఫరా చేసే 32 వోల్టుల సామర్థ్యంగల పవర్ బస్‌కు, చాసిస్(చట్రం)కు మధ్య వోల్టేజీలో తేడా ఏర్పడింది.

 

ఇందుకు కారణాలను తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు పరీక్షలు చేపట్టారు. ప్రస్తుతం రోవర్ కంప్యూటర్లతోసహా పూర్తి సురక్షితంగా ఉందని, అన్ని కార్యకలాపాలూ నిర్వహించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగానే రోవర్‌లో వోల్టేజీ మార్పుపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. మార్స్‌పై జీవం ఆనవాళ్ల అన్వేషణ కోసం నాసా పంపిన క్యూరియాసిటీ  2012 ఆగస్టులో ఆ గ్రహంపై దిగి అక్కడి మట్టిని, శిలలను పరీక్షిస్తూ సమాచారం పంపుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement