చైనాలో తగ్గి... జపాన్ లో పెరుగుతున్నారు | Sakshi
Sakshi News home page

చైనాలో తగ్గి... జపాన్ లో పెరుగుతున్నారు

Published Mon, Jan 2 2017 11:46 PM

చైనాలో తగ్గి... జపాన్ లో పెరుగుతున్నారు

హైదరాబాద్ : ప్రపంచ దేశాలతో పోల్చితే అమెరికాలో అత్యధికంగా మిలియనీర్లు ఉండటం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. అయితే ఆశ్చర్యకరంగా ఆ జాబితాలోకి చిన్న దేశం అందునా భూకంపాలతో సతమతమయ్యే జపాన్ మిలియనేర్ల జాబితాలను పెంచుకుంటూ దూసుకురావడం విశేషం. ఆయా దేశాల్లో ఉన్న మిలియనీర్ల గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది జపాన్ దేశంలో ఎవరూ ఊహించని విధంగా ఆ జాబితా విపరీతంగా పెరిగింది.

క్రెడిట్ స్యూజ్ తాజా నివేదిక మిలియనీర్ల క్లబ్ లో జపాన్ దూసుకొస్తున్న విషయం వెల్లడైంది. మిలినీయర్ క్లబ్లో (అత్యధికంగా మిలియనీర్లు ఉన్న దేశాలు) అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉన్నప్పటికీ, మిలియనీర్ల జనాభా వృద్ధి రేటును మిగతా అన్ని దేశాలకన్నా జపాన్ ముందంజలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం జపాన్ దేశంలో 2.8 మిలియన్ మిలియనీర్లు ఉన్నారు. అయితే గత ఏడాదితో (2015) పోల్చితే  ఆ సంఖ్య 7,80,000 ఎక్కువని క్రెడిట్ స్యూజ్ నివేదిక తేల్చింది.

మిలియనేర్ల జాబితా పెరుగుదల రేటు పరిశీలిస్తే... జపాన్ కంటే అమెరికా మిలీనియర్ల జాబితా చాలా తక్కువగా పెరిగింది. మిలియనేర్ల సంఖ్య పెరిగిన దేశాల్లో జపాన్ తర్వాత జర్మని (+44,000), తైవాన్ (+27,000), ఇటలీ (+11,000) లు నిలిచాయి.  2015 సంవత్సరంతో పోల్చితే చాలా పెద్ద పెద్ద దేశాల్లో సైతం మిలీనియర్ల జాబితా అంతగా పెరక్కపోగా తక్కడం గమనార్హం. గతేడాదితో పోల్చితే యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) మిలియనీర్ల జాబితా గణనీయంగా 4,06,000 పడగొట్టుకుని 2.2 మిలియన్ల మిలీనియర్లగా నమోదైంది. మిలీనియర్ల సంఖ్యను పడిపోవడంలో యూకే తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్ (-58,000),  చైనా (-43,000) లు ఉన్నాయని క్రెడిట్ స్యూజ్ రిపోర్టు తెలిపింది. అలా మిలియనీర్ల సంఖ్య పెరక్కపోగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా లాంటి దేశాల్లో కూడా తగ్గారని నివేదిక వెల్లడించింది.


 

Advertisement
Advertisement