మరిన్ని పనామా పత్రాల విడుదల | Sakshi
Sakshi News home page

మరిన్ని పనామా పత్రాల విడుదల

Published Tue, May 10 2016 2:50 AM

మరిన్ని పనామా పత్రాల విడుదల

పనామా సిటీ: ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకుపైగా ‘పనామా’ పత్రాలను సోమవారం రాత్రి ఆన్‌లైన్‌లో  విడుదల చేసింది. www.offshoreleaks.icij. org వెబ్‌సైట్‌లో ఇవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.  3.6 లక్షల మంది వ్యక్తులు, కంపెనీల పేర్లు వీటిలో ఉన్నాయని ఐసీఐజే సభ్యులు తెలిపారు. పనామాకు చెందిన  ప్రైవేట్ లా సంస్థ మొసాక్ ఫోన్సెకా సంస్థ నుంచి తీసుకున్న సమాచారం ఈ పత్రాల్లో ఉంది.

 ‘సీబీఐ విచారణపై స్పందనేంటి!’
 న్యూఢిల్లీ: పనామా పత్రాల్లో పేర్లున్న భారతీయులపై సీబీఐ విచారణ  జరపాలని వచ్చిన ఒక పిటిషన్‌పై స్పందన ఏమిటో తెలపాలని సుప్రీం కోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన దరఖాస్తును విచారించిన కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పనామా పత్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న 500 భారతీయ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో ఒక మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

Advertisement
Advertisement