మహిళా ఎంపీలపై సహచరుల అనుచిత ప్రవర్తన | Sakshi
Sakshi News home page

మహిళా ఎంపీలపై సహచరుల అనుచిత ప్రవర్తన

Published Thu, Nov 6 2014 7:26 AM

MPS Misconduct allegations made against Canadian MPs

టొరొంటో: కెనడాలో మహిళా ఎంపీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేశారు. లిబరల్ పార్టీ ఎంపీలు స్కాట్ ఆండ్రూస్, మాసిమో పాసిట్టిపై వేటు వేసినట్టు ఆ పార్టీ నేత జస్టిన్ ట్రుడీ చెప్పారు.

ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇద్దరు మహిళా ఎంపీల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా లిబరల్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేసిన మహిళా ఎంపీల పేర్లు బయటకు వెల్లడించలేదు. వీరు న్యూ డెమొక్రటిక్ పార్టీ చెందిన వారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. మహిళా ఎంపీలు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించకపోవడంతో వారి పేర్లను గోప్యంగా ఉంచారు. స్కాట్ ఆండ్రూస్, మాసిమో పాసిట్టి వారి ఆరోపణలను ఖండించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement