సౌండ్ ప్రూఫ్ గదిలో లైంగికదాడి: 11 ఏళ్ల జైలు | Sakshi
Sakshi News home page

సౌండ్ ప్రూఫ్ గదిలో లైంగికదాడి: 11 ఏళ్ల జైలు

Published Fri, Feb 20 2015 8:24 PM

సౌండ్ ప్రూఫ్ గదిలో లైంగికదాడి: 11 ఏళ్ల జైలు

ఆయనో ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు.. ఇంద్రజాలికుడు కూడా. దురదృష్టవశాత్తు ఎందరో కళాకారులకు గురువుగానూ వ్యవహరించాడు. అయితే.. సంగీత పాఠాలకోసం తన వద్దకొచ్చిన మైనర్ విద్యార్థినులను కోరిక తీర్చమని వేధించేవాడు. తన మాటను కాదన్న బాలికల్ని బలవంతంగా రికార్డింగ్ స్టుడియోలోని సౌండ్ ప్రూఫ్ గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడేవాడు. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో విద్యార్థినులు, మహిళలను కోరిక తీర్చాలని వేధించాడు. గతంలో అతను చేసిన కర్కశ నేరాలన్నీ రుజువు కావడంతో శుక్రవారం లండన్ కోర్టు అతనికి 11 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం అతని వయసు 64. పేరు ఫిలిప్ పిక్కెట్.

లండన్లోని ప్రసిద్ధ గుయాల్థ్ మ్యూజిక్ అండ్ డ్రామా స్కూల్లో టీచర్గా పనిచేసిన కాలంలో (1979-83)లో ఆయన ఈ దురాగతాలకు పాల్పడ్డాడు. ఇంగ్లాండ్లో 'జిమ్మి సేవియల్ సెక్స్ స్కాండల్' ఉదంతంపై కోర్టు ఇచ్చిన తీర్పుతో ధైర్యం తెచ్చుకున్న పలువురు మహిళలు గతంలో తమపై జరిగిన లైంగికదాడులపై ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఆ క్రమంలోనే నాడు మైనర్ బాలికలైన తమపై మ్యూజిక్ టీచర్ ఫిలిప్ పిక్కెట్ లైంగికదాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె వెంటే ఒకరొకరుగా చాలామంది మాజీ విద్యార్థినులు ఫిలిప్ వెకిలి చేష్టల్ని బయటపెట్టారు. దీంతో 2013 ఆగస్టులో పోలీసులు ఫిలిప్ను అరెస్టుచేశారు. ఏడాదిన్నర విచారణ అనంతరం ఆరోపణలన్నీ రుజువు కావడంతో కోర్టు ఫిలిప్ పిక్కెట్కు 11 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Advertisement
Advertisement