నరేంద్రమోడీకి బ్రిటన్ నుంచి ఆహ్వానం | Sakshi
Sakshi News home page

నరేంద్రమోడీకి బ్రిటన్ నుంచి ఆహ్వానం

Published Tue, Aug 13 2013 7:23 PM

నరేంద్రమోడీకి బ్రిటన్ నుంచి ఆహ్వానం

యూకే: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి బ్రిటన్ నుంచి ఆహ్వానం అందింది.  గత పదినెలల నుంచి మోడీని ఆహ్వానించేందుకు యత్నిస్తున్న బ్రిటీష్ ప్రభుత్వం  ఎట్టకేలకు తమ దేశానికి రావాలని ఓ లేఖ ద్వారా స్వాగతం పలికింది. అధునిక భారత దేశ భవిష్యత్తు గురించి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగించవలసిందిగా నరేంద్రమోడికి ఆహ్వానం లభించింది. గత వారమే ఆహ్వాన లేఖను అందుకున్న మోడీ త్వరలో బ్రిటన్‌కు వెళ్లనున్నారు. కాగా, పలువురు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
 
 ఆయన రాకకోసం బ్రిటన్‌లో ఉన్న వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఆసక్తి చూపిస్తాన్నారని లేబర్‌పార్టీకి చెందిన ఎంపీ బ్రెంట్ నార్త్ తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ ఏం మాట్లాడుతూడో వినాలన్న ఆసక్తి అందరికి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.  నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు.  దేశంలోనే అత్యంత శక్తి వంతమైన నాయకుడన్నారు. మరో ఎంపీ స్టీఫెన్ ఫౌండ్ మాట్లాడుతూ.. 2009లో గుజరాత్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగం ఆకట్టుకుందన్నారు. తమ దేశానికి మోడీ రాక చాలా ఆలస్యమైందన్నారు. బ్రిటన్ దేశంలోని రెండు ప్రధాన పార్టీల భారతీయ విభాగాలు ఈ దశగా చొరవ చూపడం విశేషం.

 

 

 


 

Advertisement
Advertisement