'భారత్ ఆర్థికంగా పురోగతి చెందుతోంది' | Sakshi
Sakshi News home page

'భారత్ ఆర్థికంగా పురోగతి చెందుతోంది'

Published Sat, Nov 21 2015 10:06 AM

'భారత్ ఆర్థికంగా పురోగతి చెందుతోంది' - Sakshi

కౌలాలంపూర్ : భారత్, తూర్పు ఆసియా దేశాలు సహజ భాగస్వాములని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరుగుతున్న ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పారదర్శత దిశగా భారత్ అడుగులు వేస్తోందని, ప్రపంచ దేశాలన్నీ ఓసారి మా దేశానికి వస్తే.. మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు.

ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆర్థికంగా పురోగతి చెందుతుందని పేర్కొన్నారు. సంస్కరణల వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని మోదీ  పిలుపునిచ్చారు.

మోదీ ప్రస్తావించిన మరిన్ని ప్రధానాంశాలు:

  • 'అందరికీ ఇళ్లు' కార్యక్రమం ప్రారంభించాం. పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించడం దీని లక్ష్యం.
  • అనుకున్న లక్ష్యాలను చేరేందుకు తీసుకునే నిర్ణయాలే ఈ సంస్కరణలు. అంతిమలక్ష్యం భారత్ను పూర్తిగా వృద్ధిలోకి తేవడం
  • 21 వ శతాబ్ధం ఆసియా దేశాలదే. ఆసియా దేశాల వృద్ధిని చూసి ఈ మాట చెబుతున్నాను
  • వ్యవసాయం, గృహరంగం, రవాణా లాంటి రంగాలలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం
  • ఆసియాలోని చాలా దేశాలు  ఆర్థిక పరిపుష్టితో ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని భారత్ సాధించేదిశగా సాగుతోంది
  • పారదర్శకత కోసం భారత్ అడుగులు ప్రారంభించింది. ఆసియా దేశాలన్నీ మా దేశానికొచ్చి మార్పును గమనించాలి
     

Advertisement
Advertisement