‘పాక్‌ కొత్త ఆర్మీ చీఫ్‌తో జాగ్రత్తగా ఉండండి’ | Sakshi
Sakshi News home page

‘పాక్‌ కొత్త ఆర్మీ చీఫ్‌తో జాగ్రత్తగా ఉండండి’

Published Sun, Nov 27 2016 12:08 PM

‘పాక్‌ కొత్త ఆర్మీ చీఫ్‌తో జాగ్రత్తగా ఉండండి’ - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఆర్మీ కొత్త చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ భజ్వా విషయంలో భారత్‌ చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ఆర్మీ మాజీ చీఫ్‌ బిక్రమ్‌ సింగ్‌ అన్నారు. చాలా జాగ్రత్తగా అతడిని గమనించాలని, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, ప్రపంచ శాంతిని పాటించాల్సి వచ్చినప్పటికీ.. ఒక్కసారి ఆ బాధ్యతలు చేపట్టాక మాతృదేశమే తనకు ప్రధానమైందిగా తోచే ప్రమాదం ఉన్నందున భారత్‌ కాస్తంతా జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచించారు.

రహేల్ షరీఫ్ తదుపరి పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాను పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్గా నియమిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. రహేల్ షరీఫ్‌ను నుంచి ఆయన 16 వ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రహేల్ షరీఫ్ పదవీ కాలం నవంబర్ 29తో ముగియనుంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్కు ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement